పల్లెలు మరువాలి

పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయని, రెండు విడుతల్లో పెండింగ్‌ పనులుంటే వారం రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి  హరీశ్‌రావు సూచించారు.బుధవారం మెదక్‌ కలెక్టరేట్‌లో పల్లెప్రగతి పంచాయతీరాజ్‌ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌ ధర్మారెడ్డి అధ్యక్షతన  ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమస్యలు లేని పల్లెలుగా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన జిల్లాగా పేరుతెచ్చుకోవాలన్నారు. దోమలను నిర్మూలించేందుకు అవసరమైన మొక్కలను పంపిణీ చేస్తే రోగాలు రాకుండా నిరోధించవచ్చన్నారు. ఉపాధి హామీ పనుల్లో  రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సర్పంచ్‌,కార్యదర్శి, ఏఈ, ఏడీలు వాట్సాప్‌ గ్రూపు క్రియేట్‌ చేయాలని, ఇందులో సమస్యల వివరాలు తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. పల్లెప్రగతి పనుల్లో  నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులను సస్పెండ్‌ చేయాలని ఆదేశించడంతో పాటు కొందరికి మెమో ఇవ్వాలని సూచించారు. నాటిన మొక్కల్లో 85 శాతం బతికేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమష్టిగా పనిచేస్తే  సీఎం కలలు కన్న పరిశుభ్రమైన, పచ్చని పల్లెల స్వప్నాన్ని సాకారం చేయవచ్చన్నారు.  ఈ సమావేశంలో పాల్గొన్న  ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌, ఎమ్మెల్సీ శేరిసుభాశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, క్రాంతికిరణ్‌లు పల్లెల అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.


‘పల్లెప్రగతి’ పనులు దేశానికే ఆదర్శంగా నిలిచాలయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రెండు విడుతల్లో గ్రామాల్లో మిగిలిపోయిన ‘పల్లెప్రగతి’ పనులు వారం రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు సర్పంచులకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. బుధవారం మెదక్‌ కలెక్టరేట్‌లో ‘పల్లెప్రగతి’ పంచాయతీరాజ్‌ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌ ధర్మారెడ్డి అధ్యక్షతన సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, గ్రామ, మండల, డివిజన్‌, జిల్లాస్థాయి అధికారులుతో సమీక్ష జరిగింది. ఈ సమీక్షా సమావేశానికి ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, క్రాంతికిరణ్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. జిల్లాలో వారం రోజుల్లో ‘పల్లెప్రగతి’ పనులు పూర్తి చేయాలన్నారు. పల్లెప్రగతి ఒకటి, రెండు ఫేజ్‌లలో మిగిలిపోయిన పనులు పూర్తి చేయాలన్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు రాష్ట్రస్థాయి అధికారులు, స్పెషల్‌ స్వాడ్‌ బృందాలు గ్రామాల్లో ఆకస్మికంగా ఎప్పుడైనా పర్యటించవచ్చని పనులు సక్రమంగా లేని గ్రామాల్లోని కార్యదర్శులు, సర్పంచులు, అధికారులు సస్పెండ్‌ అవ్వడం ఖాయమన్నారు.