లాక్ డౌన్ ప్రభావంతో అరటి రైతులు చేతికొచ్చిన పంటను అమ్ముకోవడంలో ఇబ్బంది పడకుండా కేరళ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. హార్టికల్చర్ ప్రొడక్ట్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కేరళలో పండించిన అరటిని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. ఒక్క వయనాడ్ జిల్లాలోనే 2 లక్షల టన్నుల అరటి పంట చేతికొచ్చింది. మొత్తం 8700 హెక్టార్లలో అరటి తోటలు సాగు చేశారు.
కేరళ ప్రభుత్వం పేద ప్రజలకు అవసరమైన నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తోంది. కేరళ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో..ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తుంది.